ముంబైలో కరోనా వైరస్ వ్యాప్తి ఆందోళనకరంగా ఉన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అక్కడ మిలిటరీ లాక్‌డౌన్ విధిస్తారంటూ వాట్సాప్‌లో ఓ సందేశం తెగ చక్కర్లు కొడుతోంది. 10 రోజుల పాటు ముంబై, పుణే నగరాల్లో మిలిటరీ లాక్‌డౌన్ విధిస్తారని ఆ వార్త సారాంశం. కఠిన లాక్ డౌన్ విధించే ఆలోచన లేదని ఉద్ధవ్ థాక్రే ప్రకటించినా ఈ ఫేక్ న్యూస్ సర్క్యులేట్ కావడం గమనార్హం..‘ముంబై, పుణే నగరాలు పూర్తిగా ఆర్మీ నియంత్రణలోకి వెళ్లిపోతాయి. వీలైనంత త్వరగా నిత్యావసరాలు, కూరగాయలు తెచ్చిపెట్టుకోండి. పాలు, మందులు లాంటి అత్యవసరాలు మాత్రమే లభిస్తాయి. ముంబై, పుణే నగరాల్లో నివసించే వారంతా ఈ విషయాన్ని గమనించండి..’ అంటూ ఓ మెసేజ్‌ను సర్క్యులేట్ చేస్తున్నారు.వాట్సాప్‌లో వైరల్ అవుతున్న ఈ మెసేజ్ పూర్తిగా అవాస్తవం. ముంబై నగర పోలీసులు దీన్ని ఖండించారు. అలాంటిదేమీ లేదని స్పష్టం చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa