అనంతపురం జిల్లాలో 21 వ తేదీ నుంచి వారం రోజులపాటు లాక్‌డౌన్ అమల్లో ఉండనుంది. ఈ మేరకు ఙిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు, జిల్లా ఎస్పీ ఏసుబాబు ఓ ప్రకటన విడుదల చేశారు.
జిల్లాలో కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో లాక్‌డౌన్ ముందుగా అనంతపురం, ధర్మవరం, తాడిపత్రి, యాడికి, హిందూపురం, కదిరితో పాటు కొన్ని ప్రాంతాల్లో లాక్‌డౌన్ అమల్లో ఉంటుంది. కాగా... అనంతపురం కార్పొరేషన్ పరిధిలో ఉదయం 6 గంటల నుంచి 11 గంటల వరకు దుకాణాలకు అనుమతి ఉంటుంది.
ఆ తర్వాత ఎవరూ రోడ్డు మీదకు రాకూడదు. ఆర్టీసీ బస్సులు యధావిధిగా నడుస్తాయి. మాంసం దుకాణాలు ఆదివారం పూర్తిస్థాయిలో పనిచేస్తాయి. ఇక... వారం రోజుల తర్వాత పరిస్థితిని బట్టి లాక్‌డౌన్ కొనసాగింపుపై నిర్ణయం తీసుకుంటారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa