టీడీపీ అగ్రనేత నారా లోకేశ్ పై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ధ్వజమెత్తారు. దొడ్డిదారిన ఎమ్మెల్సీ అయిన లోకేశ్ కు క్రమశిక్షణ, సభ విలువలు తెలుస్తాయని ఆశించడం అత్యాశే అవుతుందని వ్యాఖ్యానించారు. శాసనమండలి సమావేశాల్లో జరిగిన రభసను దృష్టిలో ఉంచుకుని విజయసాయి ఈ వ్యాఖ్యలు చేశారు. ఆఖరి సమావేశం అనుకున్నాడేమో మంత్రులపైకి ఎమ్మెల్సీలను ఉసిగొల్పి వీడియోలు తీసి ఎల్లోమీడియాకు పంపించాడని ఆరోపించారు. ఒకటి మాత్రం నిజం... శాసనసభలోకి ఎప్పటికీ అడుగుపెట్టలేవు అంటూ లోకేశ్ ను ఉద్దేశించి ట్వీట్ చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa