విజయవాడ: ఆమెరికాలోని న్యూజెర్సీలో షిరిడీ సాయినాథుని ఆలయం నిర్మించనున్నట్లు సాయిదత్త పీఠం నిర్వాహకులు రఘుశర్మ, శంకర్‌లు చెప్పారు. విజయవాడలోని లబ్బీపేటలోని ఓ హోటల్లో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో వారు మాట్లాడుతూ మన దేశంలోని భక్తులు షిరిడీకి వచ్చి బాబాను దర్శనం చేసుకుంటున్నారని విదేశాల్లో భక్తులకు ఆ అవకాశం లేకుండా పోయిందన్నారు. వారికి కూడా బాబాను దర్శనం చేసుకునేందుకు షిరిడీ ఇన్ ఆమెరికా పేరుతో బాబా ఆలయాన్ని నిర్మించనున్నట్లు తెలిపారు. భక్తుల సహకారంతో 25 ఎకరాలు భూమి సేకరించామని, ఆలయానికి సంబంధించిన డిజైన్‌లు తయారవుతున్నాయన్నారు. త్వరలోనే పనులు ప్రారంభించి ఈ ఏడాదిలో తొలిదశ పనులు పూర్తివుతాయని వారు వివరించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa