ఇరాన్లో ప్రభుత్వంపై ప్రజల ఆందోళనలు తీవ్రమవుతున్న నేపథ్యంలో, అమెరికా సైనిక చర్యకు సిద్ధమవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇరాన్‌పై దాడి చేసే అవకాశాలను పరిశీలిస్తున్నట్లు తెలిపారు. ప్రజలను అణచివేసేందుకు ఇరాన్ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోందని, ఈ క్రమంలో 72 మందికి పైగా మరణించారని, వందలాది మంది గాయపడ్డారని వార్తలు వస్తున్నాయి. అమెరికా సైన్యాధికారులు పరిమిత దాడులు, ముఖ్యంగా టెహ్రాన్‌లోని కొన్ని స్థావరాలు, సైనిక క్యాంపులను లక్ష్యంగా చేసుకునే అవకాశం ఉందని సూచిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa