విజయవాడ : విజయవాడలో వెంకటేశ్వర వైభవోత్సవాల్లో కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా వెంకయ్యనాయుడు మాట్లాడుతూ గోసంరక్షణ పేరుతో దాడులు సరికాద న్నారు. అలాగే పన్నులపపై జీఎస్టీ నిర్ణయం మండలిదేగాని ప్రధాని, ఆర్థికమంత్రికి లేదన్నారు. జీఎస్టీ హడావిడిగా తీసుకున్న నిర్ణయం కాదని దేశ ప్రజలంతా గుర్తించాలని తెలిపారు. జీఎస్టీ వల్ల నష్టపోయిన రాష్ట్రాలకు కేంద్రం ఆ మేరకు సాయం చేస్తుందని పేర్కొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa