ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వైసీపీ నేతలతో వైఎస్‌ జగన్‌ కీలక సమావేశం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Jul 05, 2017, 08:25 PM

తదుపరి ఎన్నిక‌ల్లో విజ‌యం సాధించ‌డమే ల‌క్ష్యంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇప్ప‌టి నుంచే ప్ర‌ణాళిక‌లు వేసుకుంటోంది. ఈ రోజు ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్‌ కిశోర్‌తో ఏర్పాటు చేసిన స‌మావేశంలో వైసీపీ నేత‌లు పాల్గొన్నారు. ఆ పార్టీ అధినేత జగన్మోహ‌న్ రెడ్డి స‌మ‌క్షంలో జ‌రుగుతున్న ఈ స‌మావేశంలో పార్టీ బలోపేతంతో పాటు పార్టీ ప్లీనరీ ఏర్పాట్లపై చర్చించారు. ప్లీనరీ నిర్వహణ కోసం 18 కమిటీలను ఏర్పాటు చేసిన‌ట్లు తెలుస్తోంది. ఈ నెల‌ 8, 9 తేదీల్లో వైసీపీ ప్లీనరీని ఘనంగా నిర్వహించనున్నారు. గుంటూరులోని ఆచార్య నాగార్జున వర్సిటీ ఎదురుగా ఉన్న పన్నెండు ఎకరాల స్థలంలో నిర్వ‌హించ‌నున్న ఈ ప్లీన‌రీకి 30వేల మంది హాజ‌ర‌వుతార‌ని స‌మాచారం.    






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa