దేశీయ రక్షణ సామర్థ్యాన్ని మరింత బలోపేతం చేసే దిశగా మరో కీలక ముందడుగు పడింది. దీర్ఘశ్రేణి గైడెడ్ రాకెట్ పినాక (ఎల్ఆర్‌జీఆర్ 120) ప్రయోగం సక్సెస్ అయింది. ఈ రాకెట్ ప్రయోగాన్ని డీఆర్‌డీవో ఒడిశాలోని చండీపూర్ నుంచి చేపట్టింది. ఈ రాకెట్ గరిష్ఠంగా 120 కిలోమీటర్ల దూరంలో ఉన్న లక్ష్యాన్ని అత్యంత ఖచ్చితంగా ఛేదించే సామర్థ్యాన్ని కలిగి ఉందని అధికారులు తెలిపారు.ఈ పరీక్ష విజయవంతమైందని కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ‘ఎక్స్’ వేదికగా ప్రకటించారు. ఈ సందర్భంగా ప్రయోగాన్ని విజయవంతంగా నిర్వహించిన డీఆర్‌డీవో శాస్త్రవేత్తలు, సాంకేతిక నిపుణులను ఆయన అభినందించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa