చదరంగంలో మరో సంచలనం నమోదైంది. దోహా వేదికగా జరుగుతున్న ఫిడే వరల్డ్ బ్లిట్జ్ ఛాంపియన్‌షిప్-2025లో భారత యువ గ్రాండ్‌మాస్టర్, ప్రస్తుత ప్రపంచ ఛాంపియన్ డి.గుకేశ్‌కు ఊహించని షాక్ తగిలింది. కేవలం 12 ఏళ్ల వయసున్న రష్యా యువ సంచలనం సెర్గీ స్లోకిన్ చేతిలో గుకేశ్ ఓటమి పాలవ్వడం క్రీడాకారులను విస్మయానికి గురిచేసింది. మూడో రౌండ్‌లో జరిగిన ఈ ఉత్కంఠ పోరులో చివరి నిమిషంలో చేసిన ఒకే ఒక్క తప్పిదం అతని కొంపముంచింది.నల్ల పావులతో ఆడుతున్న గుకేశ్‌కు గేమ్ 70వ ఎత్తు వద్ద తీవ్రమైన సమయ ఒత్తిడి ఏర్పడింది. చేతిలో కేవలం 8 సెకన్ల సమయం మాత్రమే ఉంది. ఈ దశలో ప్రత్యర్థి స్లోకిన్ డ్రా చేసుకునే ఉద్దేశంతో రూక్ ఎక్స్చేంజ్ (ఏనుగుల మార్పిడి) ఆఫర్ చేశాడు. సాధారణంగా అది డ్రా అయ్యే గేమ్. కానీ, దూకుడుగా ఆడుతూ ఎప్పుడూ గెలుపునే కోరుకునే గుకేశ్, ఆ డ్రా ఆఫర్‌ను తిరస్కరించి తన రూక్‌ను 'f4'కి జరిపాడు.గెలుపు కోసం గుకేశ్ చేసిన ఈ సాహసం బెడిసికొట్టింది. ఆ తర్వాతి కొద్ది ఎత్తుల్లోనే గుకేశ్ తన బిషప్‌ను, చివరి పాన్‌ను కోల్పోవాల్సి వచ్చింది. పరిస్థితి పూర్తిగా చేజారిపోవడంతో మరో పది ఎత్తుల్లోనే గుకేశ్ తన ఓటమిని అంగీకరించాడు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa