నూతన సంవత్సరంలో ఆపిల్ ఉత్పత్తులపై కొనుగోలుదారులకు శుభవార్త. విజయ్ సేల్స్‌లో ఆపిల్ డేస్ సేల్ ప్రారంభమైంది. ఐఫోన్ 17 ప్రో మోడల్స్‌పై భారీ డిస్కౌంట్లు అందుబాటులో ఉన్నాయి. ఈ సంవత్సరం సెప్టెంబర్‌లో రూ.1,34,900కి లాంచ్ అయిన ఐఫోన్ 17 ప్రో ఇప్పుడు రూ.1,25,490కి లభిస్తోంది. దీనిపై రూ.9,000 ఫ్లాట్ డిస్కౌంట్‌తో పాటు, ఎంపిక చేసిన క్రెడిట్ కార్డులపై రూ.4,000-రూ.5,000 అదనపు డిస్కౌంట్ కూడా ఉంది. మొత్తం రూ.14,000 వరకు ఆదా చేసుకోవచ్చు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa