ప్రముఖ సినీ నటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. అయితే తన ఆరోగ్యం కుదుట పడుతుందని, తాను ఆరోగ్యంగా ఉండాలని ఆకాంక్షించిన అభిమానులకు పవన్ కల్యాణ్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ మేరకు జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ పేరుతో ఓ సందేశాన్ని షేర్ చేసింది. తన ఆరోగ్యం మెరుగవుతోందని, వైద్యుల సలహాలు, సూచనలు పాటిస్తున్నట్లు పవన్ కళ్యాణ్ అందులో పేర్కొన్నారు. వీలైనంత త్వరగా కోలుకుని మీ ముందుకొస్తాను అని అన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa