కర్ణాటక రాష్ట్రంలోని ఓ ఊళ్లో సగం మందికి కరోనా రావడం ఆ గ్రామంలో తీవ్ర కలకలాన్ని రేపుతోంది. న్యూస్ 18 కథనం మేరకు..కర్ణాటక రాష్ట్రంలోని బెలగావి జిల్లా ఖానాపూర్ తాలూకా ఆబానలి గ్రామంలో సగానికి సగం మందికి కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయింది. ఆ గ్రామంలో మొత్తం 300 మంది వరకు ప్రజలు ఉన్నారు. వారిలో కరోనా లక్షణాలు 150 మందికి ర్యాపిడ్ యాంటీజన్ టెస్టులు నిర్వహించారు. వారిలో 144 మందికి కరోనా పాజిటివ్ వచ్చినట్టు మంగళవారం నిర్ధారణ అయింది. దీంతో ఆ గ్రామానికి రాకపోకలను నిషేధిస్తూ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. మిగిలిన వారికి కూడా కరోనా చికిత్సలు నిర్వహిస్తామనీ, పాజిటివ్ వచ్చిన వారిని హోం క్వారంటైన్ లో ఉంచి నిరంతరం వైద్య చికిత్సలు అందిస్తామని అధికారులు చెబుతున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa