బీజేపీ సీనియర్ నేత, కేంద్రమంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ ఇచ్చిన ఉచిత సలహాపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాజస్తాన్ జోధ్‌పూర్‌లో కేంద్రమంత్రి షెకావత్ సోమవారం పలు ప్రభుత్వాసుపత్రుల్లో పర్యటించారు. ఈ సందర్భంగా కరోనాతో చనిపోయిన ఓ మృతురాలి బంధువులను ఓదార్చే క్రమంలో ‘బాలాజీ మహరాజ్ మంత్రాన్ని జపించి కొబ్బరికాయ కొట్టండి అంతా ఆయనే చూసుకుంటారు’ అని షెకావత్ చెప్పారు. ఈ కామెంట్స్ పై ట్రోలింగ్ చేస్తున్నారు నెటిజన్లు. గతంలో గో కరోనా అంటూ చేసిన స్లోగాన్ గుర్తుకు చేస్తున్నారు. కరోనాతో జరుగుతున్న పోరాటంలో విరామం లేకుండా వైద్యులు కృషి చేస్తున్నారని గుర్తు చేస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa