ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తిరుమలగిరిలో గొంతు కోసి చంపిన వైనం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, May 23, 2021, 05:22 PM

నగరంలోని తిరుమలగిరి ఆశా ఆఫీసర్స్‌ కాలనీలో దారుణం జరిగింది. రిహాబిటేషన్‌ సెంటర్‌లో ఓ వ్యక్తి హత్యకు గురయ్యాడు. నాలుగు రోజుల క్రితం రిహాబిటేషన్‌ సెంటర్‌లో నలుగురు వ్యక్తులు గొడవ పడ్డారు. వాగ్వాదం ముుదిరి ముగ్గురు వ్యక్తులు ఓ వ్యక్తిని గొంతు కోసి చంపేశారు. రిహాబిటేషన్‌ సెంటర్‌ నుంచి బయటికి వెళ్లేందుకు నిందితులు ప్లాన్ చేసి హత్య చేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. రిహాబిటేషన్‌ సెంటర్‌ను ఆశా ఆఫీసర్స్‌ కాలనీలో అక్రమంగా నడుపుతునట్లు పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ముమ్మరం చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa