కొత్తగా ఓటు హక్కు నమోదు చేసుకునేందుకు ఎన్నికల సంఘం నోటిఫికేషన్ ను జారీ చేసింది. 1 జనవరి 2022 నాటికి 18 సంవత్సరాలు నిండిన యువతీ, యువకులు ఓటు హక్కు నమోదు చేసుకోవచ్చు. మీ సేవ కేంద్రాలు, స్మార్ట్ ఫోన్లు, బీఎల్ వోల వద్ద ఓటు హక్కు నమోదు చేసుకోవచ్చు. ఓటరు రిజిస్ట్రేషన్ కోసం ఫారం-6, చిరునామా మార్పునకు ఫారం-8ఏ, సవరణకు ఫారం-8, ఓటరు జాబితాలో పేరు తొలగించేందుకు ఫారం-7 ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. నవంబర్ 30 వరకు కొత్త ఓటు హక్కు నమోదు చేసుకోవచ్చు. డిసెంబర్ 20 వరకు అధికారులు పరిశీలిస్తారు. జనవరి 5న తుది ఓటురు జాబితాను ప్రదర్శిస్తారు. కొత్త ఓటర్ల నమోదుతో పాటు అడ్రస్ మార్పులు, ఏమైనా తప్పులుంటే సవరించుకునే అవకాశం ఉంది.
https://www.nvsp.in/ ఈ లింక్ ద్వారా కొత్త ఓటరుగా నమోదు చేసుకోవచ్చు.