నంద్యాల ఉప ఎన్నికలో టీడీపీ భారీ మెజార్టీ దిశగా దూసుకుపోతుండటంతో టీడీపీ శ్రేణులు సంతోషంలో మునిగిపోయాయి. ఇటు నంద్యాలలోనే కాకుండా, అటు విజయవాడలోని ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసం వద్ద కూడా టీడీపీ నేతలు, కార్యకర్తలు బాణాసంచా కాల్చి, సంబరాలు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు తన నివాసం వద్ద విక్టరీ సింబల్ ను చూపిస్తూ, ఎన్నికలో విజయం పట్ల సంతోషాన్ని వ్యక్తపరిచారు. 13వ రౌండ్ ముగిసే సరికి టీడీపీ అభ్యర్థి బ్రహ్మానందరెడ్డి 22 వేల మెజార్టీని సాధించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa