ఐపీఎల్-2022 మెగా వేలానికి సమయం దగ్గరపడుతున్న కొద్దీ క్రికెట్ లవర్స్ లో ఉత్కంఠ పెరిగిపోతోంది. ఇప్పటికే రిటైన్ చేసుకున్న ప్రేయర్స్ జాబితాలను ఆయా ఫ్రాంఛైజీలు ప్రకటించాయి. ఇక వేలంలో ఏ ఆటగాన్ని కొనుగోలు చేయాలనే దానిపై లెక్కలు వేసుకుంటున్నాయి. ఈ క్రమంలో కొంత మంది భారత ఆటగాళ్లు వేలం పాటలో అమ్ముడుపోకుండా మిగిలిపోతారంటూ నెటిజన్లు ఆసక్తికర చర్చకు తెరలేపారు. ఈ సారి ఐపీఎల్ వేలంలో సురేష్ రైనా, దినేష్ కార్తిక్, అంబటి రాయుడు, హర్భజన్ సింగ్ ల పై జట్లు ఏ మేరకు ఆసక్తి చూపిస్తాయన్నది చర్చనీయాంశంగా మారింది. వీరికి ఐపీఎల్ లో మంచి అనుభవం ఉన్నప్పటికీ ఫిట్‌నెస్, వయసు, తన స్థాయి ప్రదర్శన కనబరచలేక పోవడం ఇబ్బందిగా మారిందంటున్నారు క్రికెట్ లవర్స్.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa