ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమాచార హక్కు కమిషన్కు ప్రభుత్వం కొత్త సారథులను నియమించింది. ప్రధాన సమాచార కమిషనర్గా శ్రీనివాసరావును ఎంపిక చేసింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ నేడు ఉత్తర్వులు జారీ చేశారు.శ్రీనివాసరావుతో పాటు మరో నలుగురిని సమాచార కమిషనర్లుగా నియమించారు. వీరిలో వి. శరత్ చంద్ర కల్యాణ చక్రవర్తి, గాజుల ఆదెన్, ఒంటేరు రవిబాబు , పరవాడ సింహాచలం నాయుడు ఉన్నారు. నియమితులైన వారంతా న్యాయవాద వృత్తికి చెందిన వారు కావడం గమనార్హం. ఈ కొత్త కమిషనర్లు మూడేళ్ల పాటు లేదా వారికి 65 ఏళ్లు వచ్చే వరకు పదవిలో కొనసాగుతారు.ముఖ్యమంత్రి అధ్యక్షతన, మంత్రులతో కూడిన సెలెక్షన్ కమిటీ చేసిన సిఫార్సులకు గవర్నర్ ఆమోదం తెలపడంతో ప్రభుత్వం ఈ నియామకాలను ఖరారు చేస్తూ గెజిట్ విడుదల చేసింది. ప్రస్తుతం కమిషన్లో ముగ్గురు సభ్యులు ఉండగా, తాజా నియామకంతో కమిషన్ బలం గణనీయంగా పెరిగింది. ఈ నియామకాలతో సమాచార హక్కు చట్టం కింద దరఖాస్తుల పరిష్కారం వేగవంతం అవుతుందని, ప్రభుత్వ కార్యకలాపాల్లో పారదర్శకత మరింత పెరుగుతుందని అధికార వర్గాలు భావిస్తున్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa