ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. వార్డు, మహిళా కార్యదర్శులను మహిళా పోలీసులుగా నియమిస్తూ గతంలో జారీ చేసిన జీవో నంబర్ 59ను ఉపసంహరించుకుంది. ఈ విషయాన్ని ప్రభుత్వ న్యాయవాది హైకోర్టుకు తెలిపారు. జీవో 59పై దాఖలైన పిటిషన్లపై విచారణ సందర్భంగా ప్రభుత్వ నిర్ణయాన్ని హైకోర్టుకు తెలిపారు. ఈ విషయంలో డ్రెస్‌కోడ్ సైతం ఉపసంహరించుకుంటున్నట్లు చెప్పారు. మహిళా పోలీస్ సేవలను ఏ విధంగా వినియోగించుకోవాలనే విషయంపై ప్రభుత్వం కసరత్తు చేస్తోందని చెప్పారు. దీనిపై పూర్తి వివరాలతో అఫిడవిట్ దాఖలు చేస్తామని తెలిపారు. దీంతో హైకోర్టు తదుపరి విచారణను మరో వారం పాటు వాయిదా వేసింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa