ప్రధాని మోడీ నేడు యూపీలో పర్యటించనున్నారు. తన సొంత నియోజకవర్గం వారణాసి లో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టనున్నారు. ఈ సందర్భంగా కాశీ విశ్వనాథ్ కారిడార్ ను పీఎం జాతికి అంకితం చేయనున్నారు. దివ్య కాశీ-భవ్యకాశీగా ఈ కార్యక్రమానికి నామకరణం చేశారు. ఈ కార్యక్రమంలో వివిధ మఠాలకు చెందిన 3వేల మంది సాధువుల, మత పెద్దలు, కళాకారులు, పుర ప్రముఖులతో పాటు బీజేపీ పాలిత 12 రాష్ట్రాల సీఎంలు పాల్గొననున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa