ఏపీకి ఏకైక రాజధానిగా అమరావతిని ప్రకటించాలని రైతులు, మహిళలు చేపట్టిన మహా పాదయాత్ర ముగిసింది. న్యాయస్థానం నుంచి దేవస్థానం పేరుతో సాగిన ఈ పాదయాత్ర చిత్తూరు జిల్లా తిరుపతి అలిపిరి శ్రీవారి పాదాల వద్దకు చేరుకుంది. ఈ సందర్భంగా రైతులు కొబ్బరికాయలు కొట్టి యాత్రను ముగించారు. అమరావతే ఏకైక రాజధాని అని ప్రకటించే వరకు తమ పోరాటం ఆగదని చెప్పారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa