చట్టాలు ఎంత కఠినంగా ఉన్నా చిన్నారులపై జరుగుతున్న దారుణాలు ఆగడం లేదు. తాజాగా స్నేహితుడి కుమార్తెపైనే సామూహిక అత్యాచారం జరిగిన ఘటన మధ్యప్రదేశ్ లో వెలుగు చూసింది. ఆలస్యంగా వెలుగు చూసిన ఈ దారుణం వివరాలు ఇలా ఉన్నాయి. జబర్ పుర జిల్లాలో ఓ దళిత (11) బాలిక ఏడో తరగతి చదువుతోంది. డిసెంబర్ ఏడో తేదీన ఆమె తండ్రి స్నేహితులు బాధితురాలి ఇంటి పెరట్లో అత్యాచారానికి పాల్పడ్డారు. నిందితుల వయసు 25,26 ఏళ్లు ఉంటాయని, ఈ ఘటనకు సంబంధించి నింధితులిద్దరినీ అరెస్ట్ చేసినట్లు అదనపు ఎస్పీ సంజయ్ అగర్వాల్ తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa