పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం మండలంలో బస్సు వాగులో పడి తొమ్మిది మంది మృతి చెందారు. ఈ ఘటనపై ప్రధాని మోదీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఈ ఘటనలో ప్రాణ నష్టం జరగడం దిగ్భ్రాంతికి గురి చేసిందని అన్నారు. ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు రూ. 2 లక్షల చొప్పున ఎక్స్ గ్రేషియా ప్రకటించారు. ఈ మొత్తం PMNRF నిధుల నుండి అందించబడుతుంది. మరోవైపు ముఖ్యమంత్రి జగన్ రూ. 5 లక్షల పరిహారం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో మరో తొమ్మిది మంది గాయపడ్డారు. క్షతగాత్రులు జంగారెడ్డిగూడెంలోని ప్రాంతీయ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa