స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పలు రాష్ట్రాల్లో 1,226 సర్కిల్ బేస్డ్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పోస్టులకు 2021,డిసెంబర్ 29 లోగా ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి.
ఎంపిక విధానం: ఆన్‌లైన్ రాతపరీక్ష, స్క్రీనింగ్, ఇంటర్వ్యూ
ఆన్‌లైన్ రాతపరీక్షలో ఆబ్జెక్టీవ్ టెస్ట్ 120 మార్కులకు, డిస్క్రిప్టీవ్ టెస్ట్ 50 మార్కులకు ఉంటాయి. ఆబ్జెక్టీవ్ టెస్ట్, డిస్క్రిప్టీవ్ టెస్ట్‌లో వచ్చిన మార్కుల ఆధారంగా మెరిట్ లిస్ట్ రూపొందిస్తారు. ఖాళీల సంఖ్య కన్నా 3 రెట్లు అభ్యర్థులను స్క్రీనింగ్ కు పిలుస్తారు. స్క్రీనింగ్‌లో ఆన్‌లైన్ అప్లికేషన్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. స్క్రీనింగ్ పూర్తైన తర్వాత అభ్యర్థులను ఇంటర్వ్యూకు పిలుస్తారు.
అభ్యర్థులు తప్పనిసరిగా ఆన్‌లైన్ రాతపరీక్ష, ఇంటర్వ్యూ క్వాలిఫై కావాలి. ఆన్‌లైన్ రాతపరీక్ష, ఇంటర్వ్యూకు 75:25 చొప్పున వెయిటేజీ ఉంటుంది. దీని ఆధారంగా తుది మెరిట్ లిస్ట్‌ను రూపొందించి అభ్యర్థులను ఎస్బీఐ ఎంపిక చేస్తుంది.
నోటిఫికేషన్ లింక్: https://sbi.co.in/documents/77530/11154687/081221-CBO-21+Final+Detailed+Advt+ENG.pdf/6d3a8188-f5a6-e9dd-98fc-e580796a0766?t=1638963781497
దరఖాస్తు లింక్: https://ibpsonline.ibps.in/sbircbonov21/
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa