పులివెందుల: నంద్యాల ఉప ఎన్నికలో తెదేపాపై అభిమానంతో ప్రజలు ఓట్లు వేయలేదని, ఓటు వేయకపోతే పింఛన్లలో కోత విధిస్తామంటూ బెదిరించి వేయించుకున్నారని వైకాపా అధినేత వైఎస్ జగన్ ఆరోపించారు. అక్టోబర్ 2 వరకు వైఎస్‌ఆర్ కుటుంబం కార్యక్రమం జరుగుతుందన్నారు. అక్టోబర్ 27 నుంచి ఆరు నెలల పాటు పాదయాత్ర కొనసాగుతుందని జగన్ స్పష్టంచేశారు. ఈ పాదయాత్రలో ప్రతి వైఎస్‌ఆర్ కార్యకర్త ఏకం కావాలని, తనకు తోడుగా నిలవాలని పిలుపునిచ్చారు. వైఎస్‌ఆర్ కుటుంబం కార్యక్రమంలో అందరూ భాగస్వామ్యం కావాలని కోరారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa