విశాఖ జిల్లాలో తీవ్ర విషాదం నెలకొంది. కోడి పందాలు ఆడుతున్న సమయంలో పోలీసులు వస్తున్నారనే భయంతో పరుగులు తీసి ఓ వ్యక్తి గుండెపోటుతో మృతి చెందిన సంఘటన మన్యంలో చోటు చేసుకుంది. గూడెంకొత్తవీధి మండలం సంకాడ కొత్తూరు సమీపంలో నిర్వహిస్తున్న కోడి పందాల శిబిరం పై గురువారం పోలీసులు దాడి చేశారు. దీంతో జూదరులు పారిపోవడానికి యత్నించారు. ఈ క్రమంలో జూదరుల్లోని చాపరాతిపాలెం గ్రామానికి చెందిన వేములపూడి చిన్నబ్బాయి (40) గుండెపోటుతో మృతి చెందాడు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa