నూతన సంవత్సరంలో ఫిబ్రవరి నెలలకు సంబంధించిన శ్రీవాణి ట్రస్టు బ్రేక్ దర్శన టికెట్ల కోటాను డిసెంబరు 28వ తేదీన మధ్యాహ్నం 3 గంటలకు టిటిడి ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది. జనవరి 1న నూతన ఆంగ్ల సంవత్సరం నాడు 1000 బ్రేక్ దర్శన(రూ.500/- లఘు దర్శనం ) టికెట్లు ఆన్‌లైన్‌లో భక్తులకు అందుబాటులో ఉంటాయి. జనవరి 13న వైకుంఠ ఏకాదశి నాడు 1000 మహాలఘు దర్శన(రూ.300/-) టికెట్లు ఆన్‌లైన్‌లో భక్తులకు అందుబాటులో ఉంటాయి. వైకుంఠ ఏకాదశి సందర్భంగా జనవరి 14 నుండి 22వ తేదీ వరకు 9 రోజుల పాటు రోజుకు 2 వేలు చొప్పున లఘు దర్శన(రూ.500/-) టికెట్లు ఆన్‌లైన్‌లో భక్తులకు అందుబాటులో ఉంటాయి. జనవరి, ఫిబ్రవరి నెలల్లో మిగతా రోజుల్లో సోమవారం నుండి శుక్రవారం వరకు రోజుకు 200 చొప్పున, శని, ఆదివారాల్లో 300 చొప్పున బ్రేక్ దర్శన(రూ.500/-) టికెట్లు అందుబాటులో ఉంటాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa