``అంతర్జాతీయ పవర్‌లిఫ్టింగ్ పోటీల్లో స్వర్ణం సాధించావు సాధియా శెహభాష్`` అంటూ టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అభినందించారు. ఈ మేరకు సోమవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. టర్కీ రాజధాని ఇస్తాంబుల్‌లో జరిగిన ఏషియన్ పవర్ లిఫ్టింగ్ చాంపియన్ షిప్ పోటీల్లో మంగళగిరికి చెందిన సాధియా స్వర్ణ పతకాన్ని సాధించడం చాలా ఆనందంగా ఉందన్నారు. 57 కేజీల విభాగంలో జరిగిన ఈ పోటీల్లో స్క్వాడ్- 167.5 కేజీలు, బెంచ్ ప్రెస్- 70 కేజీలు, డెడ్ లిఫ్ట్ 157.5 కేజీలు మొత్తంగా 395 కేజీలు బరువు ఎత్తి ఓవరాల్ బంగారు పతకాన్ని సాధించి మంగళగిరి ఖ్యాతిని అంతర్జాయతీ స్థాయికి తీసుకెళ్లిన సాధియాని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నానని పేర్కొన్నారు. సాధియా ఈ ఘనత సాధించడంలో తండ్రి, కోచ్ షేక్ సంధాని పాత్ర ఎనలేనిదని నారా లోకేష్ ప్రశంసించారు. అంతర్జాతీయ పోటీల్లో సత్తాచాటుతోన్న సాధియాకి తనకు చేతనైనంత సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa