ఒమిక్రాన్ వ్యాప్తిని కట్టడి చేసేందుకు ఇజ్రాయెల్ కరోనా వ్యాక్సిన్ నాలుగో డోసు ప్రభావంపై అధ్యయనం మొదలుపెట్టింది. ప్రపంచంలోనే తొలిసారిగా సోమవారం రోజున ఆ దేశంలోని షెబా మెడికల్ సెంటర్‌లో పలువురికి నాలుగో డోసు వేశారు. ఈ పరీక్షల్లో భాగంగా మొత్తం 6000 మందికి నాల్గవ డోసు ఇవ్వనున్నారు. అందులో 150 మంది వైద్య సిబ్బంది ఉన్నారు. యాంటీబాడీల స్థాయిలు, వైరస్ నిరోధకతపై ఫోర్త్ డోసు ప్రభావాన్ని పరీక్షించేందుకు ఈ అధ్యయనం చేపడుతున్నట్లు షెబా మెడికల్ సెంటర్ ప్రతినిధి తెలిపారు. ఫోర్త్ డోస్‌తో కలిగే అదనపు ప్రయోజనాలు, ఎవరికి అవసరం? సురక్షితమేనా? తదితర విషయాలు తెలుసుకునేందుకు ఇది దోహదపడుతుందని చెప్పారు. ప్రస్తుతం ఇజ్రాయెల్‌లో 1000 వరకు ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa