THOMSON 32 Inch JioTele OS Smart LED TV: థామ్సన్ సంస్థ భారత మార్కెట్లో తాజాగా 32 అంగుళాల QLED స్మార్ట్ టీవీని లాంచ్ చేసింది. రూ.10 వేల లోపు ధరలో అందుబాటులోకి తీసుకొచ్చిన ఈ స్మార్ట్ టీవీ JioTele OS సపోర్ట్‌తో వస్తుంది. దీని ద్వారా యూజర్లు లైవ్ టీవీ ఛానళ్లు, ఓటీటీ ప్లాట్‌ఫాంలు, గేమ్స్ తదితర వినోదాలను సులభంగా ఆస్వాదించవచ్చు. బిల్ట్-ఇన్ వాయిస్ సపోర్ట్‌తో కూడిన రిమోట్‌ను కూడా థామ్సన్ అందిస్తోంది.థామ్సన్ 32 అంగుళాల JioTele OS QLED స్మార్ట్ టీవీ (మోడల్ నంబర్: 32TJHQ002) ధరను రూ.9,499గా నిర్ణయించింది. ఈ టీవీ సేల్ జనవరి 22 నుంచి ప్రారంభం కానుండగా, ఫ్లిప్‌కార్ట్ ద్వారా కొనుగోలు చేయవచ్చు. రూ.10 వేల లోపు బడ్జెట్లో 32 అంగుళాల స్మార్ట్ టీవీ కోసం చూస్తున్న వినియోగదారులకు ఇది మంచి ఎంపికగా నిలిచే అవకాశం ఉంది.ఈ థామ్సన్ 32 అంగుళాల LED స్మార్ట్ టీవీ బెజెల్‌లెస్ QLED డిస్ప్లేతో వస్తుంది. 1366 x 768 పిక్సెల్స్ HD రెడీ రిజల్యూషన్, 350 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌తో పాటు HDR సపోర్ట్‌ను కలిగి ఉంది. యూజర్ల వీక్షణ అలవాట్ల ఆధారంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిఫార్సులను అందించడం తో పాటు స్పోర్ట్స్ మోడ్‌ను కూడా కలిగి ఉంది.ఈ స్మార్ట్ టీవీ JioTele OSపై పనిచేస్తుంది. సులభంగా ఉపయోగించుకునే యూజర్-ఫ్రెండ్లీ ఇంటర్ఫేస్తో పాటు 400కి పైగా ఉచిత లైవ్ టీవీ ఛానళ్లు, 300కి పైగా జియో గేమ్స్‌ను యాక్సెస్ చేసుకునే అవకాశం ఇస్తుంది. అలాగే పలు ఓటీటీ యాప్‌లకు కూడా పూర్తి సపోర్ట్ అందిస్తుంది.ఆడియో విషయంలో ఈ థామ్సన్ టీవీ 36W స్టీరియో బాక్స్ స్పీకర్లతో వస్తుంది. శక్తివంతమైన, క్లియర్ సౌండ్‌ను అందించేలా స్పోర్ట్స్, మూవీ, మ్యూజిక్ వంటి విభిన్న సౌండ్ మోడ్స్‌ను అందిస్తోంది.ఈ LED స్మార్ట్ టీవీ Amlogic ప్రాసెసర్‌తో పనిచేస్తూ 1GB ర్యామ్, 8GB అంతర్గత స్టోరేజ్‌ను కలిగి ఉంది. స్ట్రీమింగ్, సాధారణ గేమింగ్, లైవ్ టీవీ ఛానళ్ల వీక్షణకు ఇది సరిపోతుంది. డ్యూయల్ బ్యాండ్ వైఫై సపోర్ట్‌తో పాటు రెండు HDMI పోర్టులు, రెండు USB పోర్టులు కూడా అందుబాటులో ఉన్నాయి.అదనంగా, ఈ స్మార్ట్ టీవీలో బిల్ట్-ఇన్ వాయిస్ సెర్చ్ ఫీచర్ ఉంది. యూజర్లు వాయిస్ కమాండ్ల ద్వారా కంటెంట్‌ను సులభంగా సెర్చ్ చేసుకోవచ్చు. రిమోట్లో మైక్రోఫోన్ సపోర్ట్‌తో పాటు నెట్‌ఫ్లిక్స్, జియో సినిమా, జియోహాట్‌స్టార్, యూట్యూబ్ వంటి యాప్‌లకు ప్రత్యేక షార్ట్‌కట్ బటన్స్‌ను కూడా థామ్సన్ అందించింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa