దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా జరిగింది. అందులో భాగంగా విజయవాడలోని ఆంధ్రరత్న భవన్ లో కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను మగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఎస్ సి సెల్ చైర్మన్ కొరివి వినయ్ కుమార్, కాంగ్రెస్ ఆర్గనైజేషన్ కార్యదర్శి రాజీవ్రతన్, విజయవాడ నగర కాంగ్రెస్ అధ్యక్షులు నరహరిశెట్టి నరసింహారావు, ఏపీసీసీ ఆర్టీఐ చైర్మన్ పి వై కిరణ్ కుమార్, ఎన్ ఎస్ యు ఐ ఉపాధ్యక్షులు ధృవ కుమార్ రెడ్డి, ఏపీసీసీ సోషల్ మీడియా స్టేట్ చైర్మన్ తుమాటి బాలు, సోషల్ మీడియా స్టేట్ సెక్రటరీ సనపల రమేష్, నగర కమిటీ జనరల్ సెక్రటరీ జగన్, పీసీసీ, నగర నేతలు కార్యకర్తలు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa