న్యూఢిల్లీ: దేశీయ సైకిళ్ల తయారీ దిగ్గజం హీరో రెండు కొత్త విద్యుత్ సైకిళ్లు తీసుకువచ్చింది. లెక్ట్రో బ్రాండ్ కింద హీరో విద్యుత్ ఆధా రిత సైకిళ్లను ఉత్పత్తి చేస్తోంది. ఈ శ్రేణిలో తాజాగా ఈ-మౌంటెన్ బైక్స్ ఎఫ్ 2ఐ, ఎఫ్ ఐ మోడళ్లను నేడు మార్కెట్లో విడుదల చేసింది. ఈ సైకిళ్లను తమ అధీకృత డీలర్ల వద్ద మాత్రమే కాకుండా, ఆన్ లైన్ లోనూ బుక్ చేసుకోవచ్చని హీరో వర్గాలు తెలిపాయి. వీటిని ఒక్కసారి చార్జింగ్ చేస్తే 35 కిలోమీటర్లు ప్రయాణిస్తాయి. వీటిలో 6.4 ఏహెచ్ బ్యాటరీ పొందుపరిచారు. అత్యాధునిక బైక్ ల తరహాలో 4 ట్రావెల్ మోడ్స్ (పెడలిక్, ధైటిల్, క్రూయిజ్ కంట్రోల్, మాన్యువల్) ఇచ్చారు. ఈ రెండు మోడళ్లలో 7 స్పీడ్ గేర్స్, డ్యూయల్ డిస్క్ బ్రేకులు, బ్లూటూత్ కనెక్టివిటీ సదుపాయాలు ఉన్నాయి. ఇక, ధరల విషయా నికొస్తే... ఎఫ్ 2ఐ సైకిల్ ధర రూ.39,999... ఎఫ్ఐ ధర రూ. 40,999 అని కంపెనీ వర్గాలు వెల్లడించాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa