ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జనవరి నెలలో కొత్తగా 1.41లక్షల మందికి పింఛన్లు మంజూరయ్యాయని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. జనవరి నెలలో లబ్ధిదారులకు పింఛను కానుకగా రూ.2500 పంపిణీ చేయనున్నట్టు తెలిపారు. దీనిపై ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేశామన్నారు. 5 రోజుల పాటు పింఛను పంపిణీ కార్యక్రమం నిర్వహించనున్నట్టు ప్రకటించారు. జనవరి 1న ప్రత్తిపాడులో సీఎం జగన్ ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభిస్తారని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 61.75లక్షల మంది లబ్ధిదారులకు పింఛను పంపిణీ జరుగుతుందన్నారు. ఇందుకోసం ప్రభుత్వం రూ.1570.60 కోట్లు విడుదల చేసిందన్నారు. జనవరి నెలలో కొత్తగా 1.41లక్షల మందికి పింఛన్లు మంజూరు అయ్యాయని మంత్రి వివరించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa