హైదరాబాద్ ఏఐజి హాస్పిటల్స్ చైర్మన్, గ్యాస్ట్రోఎంటరాలజీ నిపుణులు డాక్టర్ డి. నాగేశ్వర్ రెడ్డికి వరల్డ్ ఎండోస్కోపీ ఆర్గనైజేషన్ ‘లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు’ అందించినందుకు ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వ భూషణ్ హరిచందన్ అభినందనలు తెలిపారు. గవర్నర్ శ్రీ హరిచందన్ మాట్లాడుతూ ఈ అవార్డుతో నాగేశ్వర్ రెడ్డి మరో మైలురాయిని అధికమించారని, డైజెస్టివ్ ఎండోస్కోపీ రంగంలో ఆయన గొప్పతనానికి దక్కిన అంతర్జాతీయ గుర్తింపు అని కొనియాడారు భవిష్యత్తులో ఆయన ఇలాంటి ఎన్నో అవార్డులు గెలుచుకోవాలని గవర్నర్ ఆకాంక్షించారు. ఈ మేరకు రాజ్ భవన్ నుంచి ఒక ప్రకటన విడుదల చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa