పాకిస్తాన్ లో మరోసారి బాంబు పేలుడు కలకలం రేపింది. క్వెట్టాలోని జిన్నాహ్ రోడ్డు సమీపంలో జరిగిన ఈ పేలుడులో నలుగురు ప్రాణాలు కోల్పోగా 15 మంది గాయపడ్డారు క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రికి తరలించారు. జిన్నాహ్ రోడ్డులోని. సైన్స్ కాలేజీ వద్ద ఉన్న ఓ కారు సమీపంలో పేలుడు సంభవించినట్లు...అధికారులు వెల్లడించారు. ఈ పేలుడుకు పాల్పడిన వారి వివరాలు తెలియాల్సి ఉంది. ఈ ఏడాది ఏప్రిల్ లో..... పేలుడు జరిగిన సెరేనా హోటల్ ప్రాంతానికి సమీపంలోనే.... మరోసారి బాంబు పేలుడు జరిగింది. ఖైబర్ పాఖ్ టున్ ఖ్వా, బలూచిస్తాన్ ప్రావిన్స్ లలో బాంబుపేలుళ్లు ఇటీవలఎక్కువయ్యాయి ఈ ఏడాది ఆగస్టులో అఫ్గానిస్తాన్ ను తాలిబన్లు ఆక్రమించుకున్నాక...... దాడులు తరచూ జరుగుతున్నాయి. ఈ ప్రాంతాల్లో.... పాకిస్తాన్ తాలిబన్, ఇస్లామిక్ స్టేస్ ఉగ్రవాద సంస్థల ప్రభావం తీవ్రంగా ఉంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa