ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఘోర రోడ్డు ప్రమాదం.. వ్యక్తి మృతి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Jan 02, 2022, 10:09 AM

గుంటూరు: లారీ ఢీకొని ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన శనివారం దాచేపల్లి ఇందిరానగర్‌ కాలనీ వద్ద జరిగింది. తెనాలి ప్రాంతానికి చెందిన బండ్లమూడి రమేష్‌(59) స్థానిక ట్రాన్స్‌పోర్టు కార్యాలయంలో పని చేస్తున్నాడు. ఈ క్రమంలో రోడ్డు దాటుతుండగా పిడుగురాళ్ల నుంచి దాచేపల్లి వైపు అతి వేగంగా వస్తున్న లారీ ఢీకొంది. తీవ్ర గాయాలైన రమేష్‌ను నరసరావుపేట ప్రభుత్వాసుపత్రికి తీసుకువెళ్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. పంచనామా నిమిత్తం మృతదేహాన్ని నరసరావుపేట ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు ఏఎస్సై కొండలరావు చెప్పారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa