అంతరిక్షంలో రెండు స్పేస్ సెంటర్లలో విధుల్లో ఉన్న 10 మంది వ్యోమగాములు న్యూ ఇయర్ వేడుకలను జరుపుకున్నారు. స్పేస్‌లో ఒకేసారి ఇంతమంది ఈ వేడుకల్లో పాల్గొనడం మానవ అంతరిక్ష చరిత్రలోనే ఇదే తొలిసారి కావడం విశేషం. రష్యన్ స్పేస్ ఏజెన్సీ ‘రోస్‌కాస్మోస్’ శనివారం ఈ విషయాన్ని వెల్లడించింది. భూమికి సమీప కక్ష్యలో తిరుగుతున్న అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో ఏడుగురు, చైనాకు చెందిన తియాంగాంగ్‌లో ముగ్గురు మొత్తం 10 మంది 2022 న్యూ ఇయర్ వేడుకలు చేసుకున్నట్లు ఒక ప్రకటనలో తెలిపింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa