గుంటూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా మంగళగిరి నగర పరిధిలోని యర్రబాలెం గ్రామానికి చెందిన రేమిణిశెట్టి హనుమంతరావు ఎన్నికయ్యారు. ఈమేరకు ఆదివారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. రాష్ట్ర ఎన్. ఎస్. యూ. ఐ ఉపాధ్యక్షులుగా, యువజన కాంగ్రెస్ జాయింట్ సెక్రటరీగా, ప్రస్తుత మండల వర్కింగ్ ప్రెసిడెంట్ గా తాను అందించిన సేవలను గుర్తించిన కాంగ్రెస్ పార్టీ అధిష్టానం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా తనను నియమించడం జరిగిందని తెలిపారు.
ఈ మేరకు గుంటూరు కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ ఎమ్మెల్యే మస్తాన్ వలి, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు లింగంశెట్టి ఈశ్వరరావుల చేతుల మీదుగా తన నియామకపు ఉత్తర్వులను అందజేసినట్లు హనుమంతరావు తెలిపారు. ఈ కార్యక్రమంలో పీసీసీ ప్రధాన కార్యదర్శి చిలకా విజయభాస్కర్ తదితరులు పాల్గొన్నట్లు తెలిపారు. కాగా తన పదవీ నియామకానికి కృషి చేసిన పార్టీ నేతలకు హనుమంతరావు కృతజ్ఞతలు తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa