జమ్మూలోని సాంబా జిల్లాలో నిర్మాణంలో ఉన్న వంతెన కూలిపోవడంతో ఆదివారం 13 మంది కూలీలు గాయపడ్డారు. ఇప్పటి వరకు పది మందిని జమ్మూ పోలీసులు రక్షించారు. రామ్‌గఢ్-కోల్‌పూర్ వద్ద దేవిక నదిపై బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ ప్రధాన వంతెనను నిర్మిస్తోందని అధికారులు తెలిపారు. గాయపడిన కూలీలను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. గాయపడిన ఇద్దరిని జమ్ములోని ప్రభుత్వ వైద్య కళాశాల మరియు ఆసుపత్రికి తరలించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa