టెక్నాలజీ పెరిగే కొద్ది కేటుగాళ్లు రెచ్చిపోతున్నారు. స్నానం చేస్తున్న ఓ వివాహిత వీడియోను రహస్యంగా చిత్రీకరించి బ్లాక్ మెయిల్ కు దిగాడు ఓ యువకుడు. ఈ ఘటన పశ్చిమ బెంగాల్ లోని బీర్బూంలో వెలుగు చూసింది. డిప్లొమో చదువుతున్న ఓ యువకుడు స్థానికంగా ఓ ఇంట్లో అద్దెకు ఉంటున్నాడు. ఆ ఇంటి పక్కనే ఉండే ఓ వివాహితపై కన్నేశాడు. ఆమెను లోబర్చుకోవాలని ప్లాన్ వేశాడు. ఆమె స్నానం చేస్తుండగా సీక్రెట్ గా నగ్న వీడియోలు తీసి ఆమెకే పంపించాడు. తన కోరిక తీర్చాలని లేకుంటే వీటిని సోషల్ మీడియాలో పెడతానని బ్లాక్ మెయిల్ కు దిగాడు. ఆ యువకుడి పనికి కంగారు పడిపోయిన ఆ వివాహిత అలా చేయవద్దని బతిమిలాడింది. అయినా వినకుండా బెదిరింపులకు పాల్పడ్డాడు. దీంతో చేసేదేమి లేక విషయాన్ని భర్తకు చెప్పడంతో వారు పోలీసులను ఆశ్రయించారు. టెక్నాలజీని మంచి పనులకు కాకుండా చెడు వ్యసనాలకు ఉపయోగిస్తున్న సదరు యువకుడిని అరెస్ట్ చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa