ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అఖిలపక్షం ఆధ్వర్యంలో మదనపల్లె మున్సిపాలిటీ కౌన్సిల్ ముట్టడి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Jan 31, 2022, 02:10 PM

మదనపల్లెని జిల్లా కేంద్రం చేయాలంటూ అఖిలపక్షం ఆధ్వర్యంలో మున్సిపాలిటీ కౌన్సిల్ ముట్టడి ఉద్రిక్తంగా మారింది. ఉదయాన్నే పోలీసులు కార్యాలయం చుట్టూ ఇనుప ముళ్లకంచెలు ఏర్పాటు చేసి లోనికి ఎవరినీ అనుమతించకుండా జాగ్రత్త తీసుకున్నారు. తెలుగుదేశం, జనసేన, మదనపల్లె జిల్లా సాధన సమితి, మదనపల్లి జిల్లా సాధన జేఏసీ నాయకులు..పోలీసుల ఆంక్షలను లెక్కచేయకుండా మున్సిపల్  కార్యాలయంలోకి చొచ్చుకువచ్చారు. కొందరు కార్యాలయం పైకి ఎక్కి నినాదాలు చేశారు. ఆందోళనకారులను పోలీసులు అరెస్ట్ చేసి..... స్టేషన్ కు తరలించారు. అనుకూలమైన అంశాలు ఉన్న మదనపల్లెను జిల్లా కేంద్రంగా ప్రకటించాలని డిమాండ్ చేశారు.


 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa