ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బీజేపీ ఎంపీ ప్రగ్యా ఠాకూర్‌కు కరోనా పాజిటివ్

national |  Suryaa Desk  | Published : Mon, Jan 31, 2022, 02:53 PM

పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల తొలిరోజే అధికార బీజేపీ ఎంపీ కరోనా వైరస్ బారినపడ్డారు.భోపాల్ బీజేపీ ఎంపీ సాథ్వి ప్రగ్యా సింగ్ ఠాకూర్‌కు కొవిడ్ పాజిటివ్ నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని ఆమె స్వయంగా వెల్లడించారు. 'ఈ రోజు కరోనా పరీక్ష చేయించుకోగా నాకు కరోనా పాజిటివ్ అని వచ్చింది. ప్రస్తుతం వైద్యుల సంరక్షణలో ఉన్నాను. గడిచిన కొద్ది రోజుల్లో నన్ను కలిసినవారంతా కచ్చితంగా టెస్టులు చేయించుకోని, తగిన జాగ్రత్తలు తీసుకోండి. మీ ఆరోగ్యం బాగుండాలని ప్రార్థిస్తున్నాను'అని ఎంపీ ప్రగ్యా సోమవారం ట్వీట్ చేశారు.భోపాల్ బీజేపీ ఎంపీ ప్రగ్యా సింగ్ ఠాకూర్ కొవిడ్ కాటుకు గురికావడం ఇది రెండోసారి. తొలి వేవ్ సందర్భంలోనూ ఆమెకు కొవిడ్ రావడంతో చాలాకాలంపాటు ఆస్పత్రిలో చికిత్స పొందారు. అయితే, ఆవు మూత్రం ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్లను తగ్గించి, కరోనావైరస్ నుంచి రక్షణ కల్పిస్తుందని గతంలో ప్రగ్యా ఠాకూర్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపడం తెలిసిందే.


ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్న తాను ప్రతిరోజూ గో మూత్రం తాగటం వల్ల మనగలుగుతున్నానని, కరోనావైరస్ నివారణకు గోమూత్రాన్ని మించిన మందు లేదని ప్రగ్యా వ్యాఖ్యానించారు. గో మూత్రంతో క్యాన్సర్ వ్యాధిని సైతం జయించానని ఎంపీ క్లెయిమ్ చేసుకున్నారు.


కొవిడ్ నిబంధనల నేపథ్యంలో పార్లమెంట్ సమావేశాలను పకడ్బందీగా నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. రాజ్యసభలో కార్యకలాపాలు ఉదయం పూట, లోక్ సభలో మధ్యాహ్నం పూట జరగనున్నాయి. రాష్ట్రపతి రామ్ నాథ్ కోవిద్ ఉభయ సభలను ఉద్దేశించి చేసిన ప్రసంగంలో కొవిడ్ పై మోదీ సర్కారు పోరును అభినందించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa