ట్రెండింగ్
Epaper    English    தமிழ்

గుఱ్ఱం జాషువా జిల్లాగా ప్రకటించాలి: జీవీ ఆంజనేయులు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Jan 31, 2022, 02:54 PM

గుంటూరు: కన్నీళ్లను ఖడ్గాలు గా మార్చుకుని తన కవిత్వం ద్వారా సామాజిక మార్పు తీసుకువచ్చి ప్రజల్లో చైతన్యం నింపి కోట్లాది మంది తెలుగు వారికి ప్రపంచవ్యాప్తంగా గౌరవాన్ని తెచ్చిన నవయుగ కవి చక్రవర్తి గుర్రం జాషువా గుంటూరు జిల్లా పల్నాడు ప్రాంతమైన వినుకొండకు చెందిన వారు కావటం అందరి అదృష్టమని నరసరావుపేట పార్లమెంటు టిడిపి అధ్యక్షులు మాజీ శాసనసభ్యులు జీ. వీ. ఆంజనేయులు తెలిపారు ప్రపంచంలోనే ఆంధ్ర ప్రదేశ్, గుంటూరుజిల్లాకు కీర్తి ప్రతిష్టలు తీసుకువచ్చిన మహాకవి, విశ్వనాథుడు గుర్రం జాషువా గారికి ప్రత్యేక స్థానం కల్పించాలన్నారు. ప్రభుత్వం ప్రకటించిన నూతన జిల్లాలో నరసరావుపేట (పల్నాడు)నుగుఱ్ఱం జాషువా జిల్లాగా ప్రకటించాలని జీ. వీ ఆంజనేయులు డిమాండ్ చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa