నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్(ఎన్టీపీసీ), ఝార్ఖండ్ లోని కోల్ మైనింగ్ హెడ్ క్వార్టర్స్ నిర్ణీత కాల ఒప్పంద ప్రాతిపదికన 177 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం 177 ఖాళీ పోస్టులుండగా ఇందులో మైనింగ్ ఓవర్ మెన్ పోస్టులు 74, మైనింగ్ సిర్దార్ పోస్టులు 103 ఉన్నాయి.
అర్హతలు:
- మైనింగ్ ఓవర్ మెన్ పోస్టులకు మైనింగ్ ఇంజినీరింగ్ లో డిప్లొమా ఉతీర్ణత సాధించి ఉండాలి. డీజీఎంఎస్ జారీ చేసిన ఓవర్ మెన్ సర్టిఫికెట్ ఉండాలి. కనీసం ఐదేళ్ల పనిఅనుభవం ఉండాలి. వయసు 57 ఏళ్లు మించకుండా ఉండాలి.
- మైనింగ్ సిర్దార్ పోస్టులకు పదో తరగతి/తత్సమాన ఉత్తీర్ణత సాధించి ఉండాలి. డీజీఎంఎస్ జారీ చేసిన వాలిడ్ సిర్దార్ సర్టిఫికెట్ ఉండాలి. కనీసం ఏడాది పనిఅనుభవం ఉండాలి. వయసు 57 ఏళ్లు మించకుండా ఉండాలి.
వేతనం: మైనింగ్ ఓవర్ మెన్ ఉద్యోగాలకు నెలకు రూ.50,000, మైనింగ్ సిర్దార్ ఉద్యోగాలకు నెలకు రూ.40,000 చెల్లిస్తారు.
ఎంపిక విధానం: రాత పరీక్ష, స్కిల్ టెస్ట్ ఆధారంగా
దరఖాస్తు విధానం: ఆన్ లైన్
దరఖాస్తులకు లాస్ట్ డేట్: 15-03-2022.
వెబ్ సైట్: https://careers.ntpc.co.in/
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa