ట్రెండింగ్
Epaper    English    தமிழ்

చినజీయర్ స్వామిజీ వారిని కలిసిన ఎమ్మెల్యే వల్లభనేని వంశీ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Jan 31, 2022, 03:09 PM

గౌరవ శాసనసభ్యులు డా. వల్లభనేని వంశీ మోహన్ త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చినజీయర్ స్వామిజీ వారిని సోమవారం ఉదయం మర్యాద పూర్వకంగా కలిశారు. ఫిబ్రవరి 19న కృష్ణాజిల్లా హనుమాన్ జంక్షన్ నూజివీడు రోడ్డులోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరస్వామి దేవస్థానం లో జరిగే నూతన రాజగోపురం, ధ్వజస్ధంభ పున: ప్రతిష్టా మహోత్సవానికి ముఖ్య అతిధిగా పాల్గొని తమ అమృతహస్తాలతో కార్యక్రమం దిగ్విజయంగా పూర్తి చేయాలని స్వామీజీని ఎమ్మెల్యే వంశీ ప్రత్యేకంగా అహ్వనించారు. ఎమ్మెల్యే వంశీ అహ్వనం మేరకు తాను కార్యక్రమానికి తప్పహాజరువుతానని చెప్పారు.


అదే విధంగా చిన్న జీయర్ స్వామీజీ వార్లని అహ్వనించేందకు వచ్చిన ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్, నిర్మాత నల్లమల్ల బుజ్జి లను వేద మంత్రాలతో ఆశీర్వచనం చేశారు. ఫిబ్రవరి 2 నుంచి 14వ తారిఖు వరకు శంషాబాద్ శ్రీ రామానుజ సహస్రబ్ధి సమాహారం కార్యక్రమానికి హాజరు కావాలని ఎమ్మెల్యే వంశీ మోహన్ ను చిన్న జీయర్ స్వామి అహ్వనించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa