గుడ్ మార్నింగ్ విజయవాడ సెంట్రల్ కార్యక్రమంలో భాగంగా ప్రజా సమస్యల పరిష్కారం కొరకు 1వ డివిజన్ ఆదర్శ్ కాలనీ, కార్మిల్ నగర్, టీచర్స్ కాలనీలలో సెంట్రల్ నియోజకవర్గ శాసన సభ్యులు మల్లాది విష్ణు, స్థానిక కార్పొరేటర్ అధికారుతో కలసి పర్యటించారు. ఈ సందర్భం గా మల్లాది విష్ణు మాట్లాడుతూ ఒకటవ డివిజన్ లో ప్రతి ఇంటికి తిరిగి స్థానికుల నుండి సమస్యలు తెలుసుకోవటం జరిగింది. నగరం విస్తరిస్తున్న దృశ్య ఏర్పడుతున్న సమస్యలను పరిష్కరిస్తున్నామన్నారు. వైసీపీ ప్రభుత్వం అధికారం లో కి వచ్చిన నాటి నుండి ప్రతి డివిజన్ లో ప్రజకు కావాల్సిన అన్ని మౌలిక వసతులు కల్పిస్తున్నామని తెలిపోయారు. నగరం లో జరిగిన బాలిక ఆత్మహత్య ఘటన పై విష్ణు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. 9 వ తరగతి బాలిక పై 50 సంవత్సరాలకు పైబడిన ఓ రాజకీయ పార్టీ కి చెందిన వ్యక్తి లైంగిక దాడి కి పాల్పడటం దారుణమన్నారు. నిందితుడి కి కఠిన శిక్ష పడే విధం గా చూస్తామన్నారు
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa