ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఏకంగా రూ.వేల కోట్లు గెలిచాడు...కానీ వచ్చి తీసుకోలేదు

international |  Suryaa Desk  | Published : Mon, Jan 31, 2022, 03:45 PM

లక్కి ఒక్కసారే తలుపుతట్టుతుందటా. అపుడు మేలుకోకపోతే అంతే మరి. ఇలాంటి ఘటనే అమెరికాలో చోటు చేసుకొంది. అగ్రరాజ్యం అమెరికాలో విరివిగా లాటరీలు నిర్వహిస్తుంటారు. కాలిఫోర్నియా రాష్ట్రంలో నిర్వహించే లాటరీల్లో మెగా మిలియన్స్ లాటరీకి ఎంతో గుర్తింపు ఉంది. ఇది గెలిస్తే వేల కోట్లలో ప్రైజ్ మనీ ఉంటుంది. అయితే తాజాగా ఓ నెంబరుకు జాక్ పాట్ తగిలింది. ఒకటి కాదు, రెండు కాదు... ఏకంగా రూ.3,197 కోట్ల ప్రైజ్ మనీ ఆ లాటరీ టికెట్ కొన్న వ్యక్తి పరమవుతుంది. గత శుక్రవారం డ్రా తీయగా, ఇంతవరకు ఆ టికెట్ కొన్న వ్యక్తి ముందుకు రాలేదు. లాస్ ఏంజెలిస్ లోని ఓ గ్యాస్ స్టేషన్ వద్ద జాక్ పాట్ గెలిచిన టికెట్ అమ్ముడైనట్టు గుర్తించారు. ఎవరు కొన్నారన్నది ఇంకా తెలియరాలేదు. అయితే, ఈ ప్రైజ్ మనీ అందుకోవడానికి సంవత్సరం వరకు గడువు ఇస్తారు. ఆ తర్వాత టికెట్ తెచ్చినా ప్రయోజనం ఉండదు. అయితే రూ.3 వేల కోట్లకు పైగా గెలిచిన ఆ లక్కీ వ్యక్తి ఎవరో తెలుసుకునేందుకు అమెరికన్లు ఆసక్తి చూపిస్తున్నారు. ఇదిలావుంటే కాలిఫోర్నియాలో నిర్వహించే ఈ లాటరీ టికెట్ల అమ్మకాల ద్వారా వచ్చే సొమ్మును రాష్ట్రంలోని విద్యాశాఖ అభివృద్ధికి వినియోగిస్తుంటారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa