ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పాము కాటుతో భర్త చనిపోయాడన్న భార్య.. పోలీసుల ఎంట్రీతో అసలు విషయం బయటికి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Jan 31, 2022, 04:51 PM

కాలక్షేపానికి మొదలైన పరిచయం ఆ తరువాత మహిళ వివాహేతర సంబంధాలకు దారి తీస్తోంది. తాజాగా అనంతపురం జిల్లాలోనూ అలాంటి ఘటనే చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. అనంతపురం జిల్లా ఆలమూరు గ్రామానికి చెందిన చెయ్యేడు వీరేంద్రకు అదే గ్రామానికి చెందిన విజయ లక్ష్మితో కోనేళ్ళ క్రిందట వివాహం జరిగింది. వివాహం అయిన నాటి నుంచి అదే గ్రామంలో నివాసం ఉంటున్నారు భార్యాభర్తలు. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఎంతో ఆనందంగా సాగుతున్న వీరి దాంపత్య జీవితంలో వివాహేతర సంబంధం పెను దుమారం రేపింది. భార్య విజయలక్ష్మి.. తన సమీప బంధువైన చెయ్యేడు సందీప్ తో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఇక భర్త రవీంద్ర ఇంట్లో లేని సమయంలో నిత్యం ఇద్దరూ ఏకాంతంగా గడిపేవారు. ఈ విషయం తన భర్తకు తెలియడంతో అడ్డుపడుతున్నాడని ప్రియుడి దగ్గర చెప్పుకొని వాపోయింది. అతడి అడ్డు తొలగించాలని కోరింది. దీంతో ఆ ఇద్దరూ కలిసి పథకం రచించి రవీంద్రను హత్య చేయాలి అనుకున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa