ట్రెండింగ్
Epaper    English    தமிழ்

విషాదం.. సెల్ఫీ తీసుకుంటూ ప్రమాదానికి గురైన యువకుడు మృతి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Feb 01, 2022, 03:26 PM

గుంటూరు: సెల్ఫీ తీసుకుంటూ ప్రమాదానికి గురైన యువకుడు మృతి చెందాడు. ఇటీవల పిడుగురాళ్ల రైల్వే స్టేషన్ సమీపంలో ఆగి ఉన్న గూడ్సు రైలు బండిపై ఎక్కి సెల్ఫీ దిగుతూ ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ కు గురైన వ్యక్తిని గుంటూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ యువకుడు కటకం వీరభద్రుడు సోమవారం రాత్రి మృతి చెందినట్లు రైల్వే పోలీసు అధికారులు తెలిపారు. ప్రస్తుతం గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రిలో పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని ఇంటికి తరలిస్తున్నట్లు వారు తెలిపారు. మృతుడు వీరభద్రుడి స్వగ్రామం మాచవరం మండలం వేమవరం అని తెలిసింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa