ట్రెండింగ్
Epaper    English    தமிழ்

విజయవాడలో మైనర్ బాలిక బలవన్మరణం బాధాకరం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Feb 01, 2022, 03:48 PM

తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుండి సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అనే మూల సిద్ధాంతానికి కట్టుబడి ఉందని, మృగాళ్ళు సైకోలు కీచకులు రౌడీలు దొంగలు దోపిడీదారులు కబ్జాకోరులకు పార్టీలో చోటు ఉండదని పెనమలూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జీ శ్రీ బోడె ప్రసాద్ అన్నారు.
వినోద్ జైన్ వేదింపులకు ఆత్మహత్య చేసుకున్న మైనర్ బాలిక కుటుంబ సభ్యులను పరామర్శించి, తెలుగుదేశం పార్టీ తరుపున అండగా ఉంటామని, న్యాయం జరిగేలా చూస్తామని బాలిక కుటుంబ సభ్యులకు భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ, మహిళలపై వేధింపులకు పాల్పడే వ్యక్తులను చంద్రబాబునాయుడు అస్సలు సహించరని, సంఘటన జరిగిన వెంటనే క్రమశిక్షణ చర్యలు తీసుకొని, పార్టీ నుండి బహిష్కరించడమే ఇందుకు నిదర్శనమన్నారు. దిశ చట్టం అంటూ గప్పాలు కొట్టుకోవడం మాని, నిందితుడికి త్వరితగతిన కఠినంగా శిక్ష పడితేనే బాలిక ఆత్మ శాంతిస్తుందని, కీచకులకు, మృగాళ్ళకు ఓ హెచ్చరిక అవుతుందన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa